Wednesday, January 22, 2025

జూన్ 2నే ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్..

- Advertisement -
- Advertisement -

అరుణాచల్, సిక్కిం రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీలను మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.ఈ రెండు రాష్ట్రాల్లో జూన్ 2వ తేదీ అసెంబ్లీ గడువు ముగియనుంది. అయితే, అసెంబ్లీ గడువు కంటే ముందే ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగా ప్రకటించిన జూన్ 4న కాకుండా జూన్ 2నే అరుణాచల్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలని ఇసి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు సిక్కిం రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

కాగా, లోక్ సభ ఎన్నికలతోపాటు ఎపి, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా ఇసి ప్రకటించిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు మొత్తం 7 విడతల్లో నిర్వహించనున్నట్లు సిఇసి రాజీవ్ కుమార్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News