Tuesday, November 5, 2024

వంతెన కట్టకపోతే ఎన్నికల బహిష్కరణ

- Advertisement -
- Advertisement -

ఇటానగర్: పీసం నదికి ఉప నది అయిన హిజుమ్ నదిపై ప్రభుత్వం శాశ్వత వంతెన నిర్మించని పక్షంలో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్ జిల్లాకు చెందిన మూడు గ్రామాల ప్రజలు హెచ్చరించారు.

2014 నుంచి తాము వంతెన కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. రిమె మోకో, పిడి రిమె, తోడి రిమె అనే మూడు గ్రామాల మొత్తం జనాభా దాదాపు 400 ఉంటుంది. ఇందులో సుమారు 300 మంది ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ మొత్తం జనాభా 13.84 లక్షలు.

ప్రస్తుతం హిజుమ్ నదిపై కర్రలతో చేసిన తాత్కాలిక వంతెనను ప్రజలు ఉపయోగిస్తున్నారు. స్థానికులు తయారు చేసుకున్న ఈ కర్ర వంతెన వర్షాకాలంలో నది దీని పైనుంచి ప్రవహిస్తుంటుంది. వర్షాకాలంలో గ్రామస్తులు తమ పిల్లలను స్కూలుకు పంపడం మానుకుంటున్నారు. ఎవరికైనా సుస్తీ చేస్తే ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. తమకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందలేకపోతున్నామని వారు తెలిపారు. పిడీ రిమె నుంచి హిమ్ వరకు అన్ని కాలాలను తట్టుకునే విధంగా ఒక శాశ్వత రోడ్డుతోపాటు హిజుమ్ నదిపై వంతెననను నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News