Wednesday, January 22, 2025

ఫాసిజం పడగనీడలో స్వాతంత్రం: విశ్లేషించిన అరుంధతీరాయ్‌కు అవార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్‌కు సాహిత్యపు జీవన సాఫల్య పురస్కారం 45వ యూరోపియన్ ఎస్సే ప్రైజ్‌ను ఛార్లెస్ విలియన్ ఫౌండేషన్ ప్రకటించింది. 2021 నాటి ఆమె ఆజాదీ వ్యాసాల సంకలనపు ఫ్రెంచ్ తర్జుమాకు గాను అరుంధతీరాయ్‌కు ఈ అవార్డు దక్కింది. ప్రపంచ నిర్మాణ ప్రక్రియలో భాషకు ఉన్న అనుబంధం ఈ వ్యాస సంకలనంతో ప్రతిఫలించిందని జ్యూరీ తెలిపింది. తన రచనత అంబులపొదితో ఆమె విశ్లేషణాత్మక దాడికి దిగారు. ఫాసిజం ఏఏ రూపాలలో ఇప్పుడు వెళ్లూనుకుంటుందనేది తెలియచేశారు. తమ వ్యాసాలను ఆమె ఇందుకు ప్రతిభావంతంగా వినియోగించుకున్నారు. ఫాసిజం రూపం ఇది ఏ విధంగా నిర్మితం అవుతోంది? మన జీవన క్రమాలను ఏఏ రీతులలో కబళించివేస్తోందనే విషయాలను సమగ్రంగా వివరించారు.

ఈ విధంగా ఈ వ్యాసాల ఇతివృత్తం ప్రాధాన్యతను సంతరించుకుందని న్యాయనిర్ణేతలు తెలిపారు. రాయ్ రాజకీయ సంకల్పిత చర్య అంకితభావంతో కూడుకుందని జూరీ పేర్కొంది. బలోపేతం అవుతున్న అధికారికతత్వం నడుమ ప్రపంచంలో ఇప్పుడు స్వాతంత్రానికి మారుతున్న అర్థం గురించి రచయిత్రి సమగ్రంగా విశ్లేషించారని తెలిపారు. ఢిల్లీకి చెందిన ఈ రచయిత్రి బుకర్ ప్రైజ్ అవార్డులు కూడా పొందారు. ఇప్పుడు ఆమె అందుకున్న అవార్డు పరిధిలో రాయ్‌కు స్విస్ కరెన్సీలో 20000 ( భారతీయ కరెన్సీలో దాదాపు రూ 18 లక్షలు ) అందుతాయి. సెప్టెంబర్ 12న స్విస్ నగరం లాసానేలో జరిగే కార్యక్రమంలో అవార్డు బహుకరణ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News