Saturday, April 5, 2025

ఆరూరి… కమలం బాట

- Advertisement -
- Advertisement -

కిషన్‌రెడ్డి వెంట ఢిల్లీకి పయనం
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలం రేపింది. రెండు రోజుల కితం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరూరి రమేష్‌ను మాజీ సిఎం కెసిఆర్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడించడంతో తాను బిఆర్‌ఎస్‌లో కొనసాగనున్నట్లు ప్రకటించారు. గురువారం మనసు మార్చుకుని కమలం తీర్థం పుచ్చుకునేందుకు హస్తిన బాట పట్టారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంట ఢిల్లీ వెళ్లినట్లు ఆయన అనుచరులు వెల్లడించారు. పార్టీ పెద్దలు సమక్షంలో పార్టీలో చేరుతారని వెంటనే వరంగల్ ఎంపి సీటు ప్రకటిస్తారని చెబుతున్నా రు. శుక్రవారం ఆరూరి రమేష్ రాజకీయ డ్రామాకు తెరపడుతుందని బిజెపి వర్గాలు వెల్లడించా యి. మరో పక్క ఆపార్టీలో ఇతర పార్టీల నుంచి నేతలకు రాత్రికి రాత్రి టికెట్లు ఇవ్వడంపై స్దానిక క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తుంది. తమను సంప్రదించుకుండా చేర్చుకోవడం పార్టీ పెద్దలపై ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం శ్రమిస్తే విలువ లేకుండా పోయిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News