Monday, December 23, 2024

ప్రభుత్వాలను హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ బిజెపి: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

 

Kejriwal

న్యూఢిల్లీ:  ప్రభుత్వాలను వరుసగా హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ బిజెపి అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బిజెపి ప్రయత్నించిందని, తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి లాక్కునేందుకు ప్రయత్నించిందని… అయితే, తమ ఎమ్మెల్యేలు ఎవరూ వారి బుట్టలో పడలేదని అన్నారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు. తమ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లలేదనే విషయాన్ని బల పరీక్షలో నిరూపిస్తానని తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఇరికించేందుకు సిబిఐ ఎంతో ప్రయత్నించిందని, ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో పావలా కూడా పట్టుకోలేకపోయిందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే మనీశ్ ని ఒక బిజెపి నేత సంప్రదించారని, ఆప్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావాలని,  ముఖ్యమంత్రి పదవిని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లను ఇస్తామని ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అయితే మనీశ్ ఆ ఆఫర్ ను తిరస్కరించారని, దీంతో వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలందరూ వజ్రాలని, వారిని ఎవరూ కొనలేరని గట్టిగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News