Thursday, November 21, 2024

ఎన్‌డిఎ రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇవ్వండి.. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేస్తా

- Advertisement -
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీకి ఒక సవాల్ విసిరారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల లోగా ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని మోడీని కేజ్రీవాల్ సవాల్ చేశారు. ఆ డిమాండ్‌ను ఆయన నెరవేరిస్తే తాను కాషాయ పార్టీ తరఫున ప్రచారంచేస్తానని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. ‘జన్‌తా కీ అదాలత్’లో ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగిస్తూ, రాష్ట్రాల వ్యాప్తంగా బిజెపి ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని ఆరోపించారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ నుంచి బిజెపికి ఉద్వాసన లభించబోతున్నదని ఆయన జోస్యం చెప్పారు. ‘డబుల్ ఇంజన్’ మోడల్‌ను ‘డబుల్ లూటీ, డబుల్ అవినీతి’గా కేజ్రీవాల్ అభివర్ణించారు.

‘ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల లోసల 22 బిజెపి పాలిత రాష్ట్రాలు అన్నిటిలో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించవలసిందిగా ప్రధాని మోడీని సవాల్ చేస్తున్నాను. ఆయన ఆ పని చేస్తే బిజెపి కోసం నేను ప్రచారం చేస్తాను’ అని కేజ్రీవాల్ చెప్పారు. ‘బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లలో త్వరలోనే పతనం కానున్నట్లు ఎగ్జిల్ పోల్స్ సూచిస్తున్నాయి’ అని ఆయన చెప్పారు. బిజెపిని నిరుపేదల వ్యతిరేకి అని కూడా కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో హోమ్ గార్డులకు వేతనాల నిలిపివేతను, బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల తొలగింపును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదు. అది ఎల్‌జి పాలన కింద ఉంది’ అని కూడా కేజ్రీవాల్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News