Thursday, December 19, 2024

మోడీ జపం చేసే భర్తలకు అన్నం పెట్టకండి.. మహిళలకు కేజ్రీవాల్ పిలుపు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మోడీ జపం చేసే భర్తలకు అన్నం పెట్టొద్దని మహిళలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. పురుషులు ప్రధాని మోడీ పేరును జపిస్తున్నారని, దీంతో భర్తలకు భార్యలు భోజనం పెట్టొద్దని సూచించారు. మోడీ పేరు జపిస్తే ఖరాఖండీగా భోజనం పెట్టనని భర్తలకు భార్యలు చెప్పాలన్నారు. ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ సమరోహ్’ కార్యక్రమంలో సందర్భంగా నెలకు మహిళలకు రూ.1000 పథకాన్ని సిఎం కేజ్రీవాల్ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెయ్యి రూపాయల పథకం అనేది మహిళలకు నిజమైన సాధికరతను సూచిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత కరెంట్, ఉచిత బస్ సౌకర్యం, పతి నెల మహిళలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నానని, ఆప్‌కు మద్దతు ఇవ్వాలని మహిళలలు ప్రమాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళల కోసం బిజెపి ఏం చేసిందని ప్రశ్నించారు. బిజెపికి ఎందుకు ఓటు వేయాలని కేజ్రీవాల్ అడిగారు. మహిళా సాధికారత పేరు మోడీ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. పార్టీలో ఇద్దరు, ముగ్గురు స్త్రీలకు పదవులు ఇచ్చి మహిళా సాధికారత సాధించమనడం కరెక్ట్ కాదని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. డబ్బుతోనే మహిళలకు నిజమైన సాధికారత వస్తుందని, ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనతో నిజంగా మహిళామణులు బాగుపడుతారని కేజ్రీవాల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News