Thursday, December 19, 2024

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) జారీచేసిన సమన్లను ఖాతరు చేయనందుకు అరెస్టు కాకుండా ఢిలీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15,000 వ్యక్తిగత బాండు, రూ. 1 లలక్ష సెక్యూరిటీ బాండును సమర్పించాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది. ఇడి జారీచేసిన మసన్లను పదేపదే బేఖాతరు చేయడం ద్వారా ఐపిసిలోని 174 సెక్షన్‌ను కేజ్రీవాల్ ఉల్లంఘించినట్లు ఇడి కోర్టుకు ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టు కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేసింది.

ఎకైజ్ పాలసీ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్‌కు 8 సమన్లను పిఎంఎల్‌ఎ చట్టం కింద జారీచేసిటన్లు కోర్టుకు ఇడి తెలిపింది. అయితే ఆయన ఆ ఎనిమిది సమన్లను ఖాతరు చేయలేదని ఇడి ఫిర్యాదు చేసింది. కాగా..ఏప్రిల్ 1న జరిగే తదుపరి విచారణకు కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరు కావలసిన అవసరం లేదు. ఇడి సమన్లకు గైర్హాజరయిన సందర్భంగా కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థకు పంపిన లేఖలో ప్రతిపక్ష నాయకులను లక్షంగా చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. ఇడి తాజాగా ఫిబ్రవరి మాసం చివరిలో కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేస్తూ మార్చి 4న హాజరుకావాలని ఆదేశించింది.

అయితే..చట్టవిరుద్ధమైనవిగా అభివర్ణిస్తూ గత సమన్లకు స్పందించిన తీరులోనే తాజా సమన్లకూ కేజ్రీవాల్ స్పందించారు. తాను వ్యక్తిగతంగా ఇడి ఎదుట హాజరుకాబోనని, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరవుతానని ఇడికి తెలిపారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింవ ఇడి అరెస్టు చేసింది. ఇడి తన చార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరును అనేకసార్లు ప్రస్తావించింది. ఎక్సైజ్ పాలసీని రూపొందించిన సమయంలో ఈ కేసులోని నిందితులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సంప్రదింపులు జరిపారని ఇడి పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News