Tuesday, November 5, 2024

కేజ్రీవాల్ కస్టడీ ఆగస్టు 20 వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని ఆగస్టు 20 వరకు ఢిల్లీ కోర్టు గురువారం పొడిగించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కస్టదీని పొడిగించారు. ఈ కేసులో కేజ్రీవాల్‌పై సిబిఐ దాఖలు చేసిన అదనపు చార్జిషీట్‌ను ఆగస్టు 12న కోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. జూన్ 26న తీహార్ జైలులో కేజ్రీవాల్‌ను సిబిఐ అరెస్టు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టయి తీహార్ జైలులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News