న్యూఢిల్లీ: దేశంలోని 80 శాతానికి పైగా ప్రభుత్వ స్కూళ్లు డంప్ యార్డులకన్నా అధ్వాన్నంగా ఉన్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి బుధవారం రాసిన లేఖలో ఆరోపించారు. దేశంలోని 14,500 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలన్న ప్రధాని మోడీ నిర్ణయాన్ని సముద్రంలో నీటి బొట్టుగా మంగళవారం అభివర్ణించిన కేజ్రీవాల్ దేశంలోని 10 లక్షల ప్రభుత్వ స్కూళ్లు అన్నిటినీ ఆధునీకరించేందుకు అన్ని రాష్ట్రాలతో చర్చించి ఒక ప్రణాళికను రూపొందించాలని ప్రధానికి సూచించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ బుధవారం ఒక లేఖ ద్వారా తెలియచేసిన కేజ్రీవాల్ భారత్‌లో ప్రతిరోజు 27 కోట్ల మంది విద్యార్థులు స్కూళ్లకు వెళతారని తెలిపారు. వీరిలో 18 కోట్ల మంది ప్రభుత్వ పాఠశాలలకు వెళతారని, అయితే 80 శాతానికి పైగా ప్రభుత్వ స్కూళ్లు డంప్ యార్డుల కన్నా అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశంలోని 10 లక్షల ప్రభుత్వ స్కూళ్లు అన్నిటినీ తిరిగి అభివృద్ధి చేసేందుకు ఒక ప్రణాళిక రూపొందించాలని ఆయన ప్రధాని మోడీని కోరారు.
Arvind Kejriwal letter to PM Modi on Govt Schools