Monday, December 23, 2024

బల పరీక్షకు ఆప్ సర్కార్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ జరగనున్నది. తమకు రూ. 25 కోట్లను ముట్టచెబుతామని ప్రలోభ పెడుతూ బిజెపి సభ్యులు కొందరు తమను సంప్రదించారని తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తనకు చెప్పారని విశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆప్ అధినేత తెలిపారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారని, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం పడిపోతుందని కూడా బిజెపి ఎమ్మెల్యేలు బెదిరించినట్లు ఆప్ ఎమ్మెల్యేలు తెలిపారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు తప్పుడుదని, ఆప్ ప్రభుత్వాన్ని కూల్చాలని బిజెపి భావిస్తోందని ఆయన ఆరోపించారు.

ఏడుగురు బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్
లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలినందుకు ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఏడుగురు బిజెపి ఎమ్మెల్యేలను ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. బిజెపి సభ్యుల ప్రవర్తనను గురువారం అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్ సభా హక్కుల కమిటీ దృష్టికి తీసురు వెళ్లారు. కాగా..అధికార ఆప్ ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నాయకుడు(బిజెపి) రాంవీర్ సింగ్ బిధూరి ఆరోపించారు. ఆప్ ప్రభుత్వ విజాయలను ప్రస్తావిస్తూ గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా అసెంబ్లీలో ప్రసంగిస్తున్న తరుణంలో బిజెపి సభ్యులు పలుమార్లు ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు వారు ప్రయత్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News