Monday, December 23, 2024

కేజ్రీవాల్ సరికొత్త వాగ్దానం

- Advertisement -
- Advertisement -

Arvind Kejriwal new poll promise for Punjab

చండీగఢ్ : పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవినీతిని నిర్మూలిస్తామని, ఆ పార్టీ చీఫ్ , ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. యువత రాష్ట్రాన్ని వదిలి, విదేశాలకు వెళ్ల వలసిన తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయని, తమ భూములను కేవలం రూ. 20 లక్షల నుంచి రూ.25 లక్షలకు అమ్ముకోవలసి వస్తోందన్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే పంజాబ్‌కు ఏమవుతుందని ప్రశ్నించారు. తాము అలా జరగనివ్వబోమని తెలిపారు. యువతను ఉద్దేశించి ఆయన శనివారం విడుదల చేసిన వీడియోలో ఈ వాగ్దానం చేశారు. పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ గెలిచి అధికారం లోకి వస్తే పరిశ్రమలు తిరిగి వస్తాయని, కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతాయని , నూతన పాఠశాలల, కొత్త ఆస్పత్రులను నిర్మిస్తామని చెప్పారు. ఇవన్నీ తాము ఢిల్లీలో చేసి, చూపించామన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ 26 ఏళ్లు, శిరోమణి అకాలీదళ్ 19 ఏళ్లు పాలించి సర్వనాశనం చేశాయన్నారు. కేజ్రీవాల్ ఇటీవల జలంధర్‌లో మాట్లాడుతేఊ తమ ప్రభుత్వ ఏర్పాటైతే కొత్తగా పన్నులను విధించబోమని, వీధి ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News