Wednesday, January 22, 2025

ఈడీ సమన్లు బేఖాతరు… సీఎం కేజ్రీవాల్ గైర్హాజరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముఖం చాటేశారు. ఈడీ ముందు సోమవారం విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. జలబోర్డు టెండరింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ జగదీష్ అరోరా, కాంట్రాక్టర్ అనిల్ కుమార్ అగర్వాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. కాగా ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, ఈడీ కేసు నమోదు చేసిన విషయం కూడా తమకు తెలియదని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది.

యాంటీ మనీలాండరింగ్ చట్టం కింద అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ కేసు నమోదు చేయడం ఇది రెండోసారి. ఇప్పటికే ఆయన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీలాండరింగ్ కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఎనిమిదిసార్లు ఈడీ సమన్లు జారీ చేయగా, ప్రతిసారి ఆయన గైర్హాజరవుతూ వస్తున్నారు. 9 వసారి ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఈనెల 21న తమ ముందు హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌ను ఆ సమన్లలో కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News