Thursday, January 23, 2025

ఒకవేళ నా డిమాండ్లు నెరవేరిస్తే బిజెపికి ప్రచారం చేస్తా: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కేంద్రం లోని బిజెపి ప్రభుత్వానికి అనూహ్య సవాలు విసిరారు. తాను జైలులో ఉన్నప్పుడు తనను బాధపెట్టారని అన్నారు. దాంతో తనకు ఆరోగ్య సమస్యలు తీవ్రమైనాయన్నారు. ‘‘జైలులో నాకు ఇన్సులిన్ సరఫరా ఆపేశారు. నా కిడ్నీలు పనిచేయకుండా పోయేవి. నేను చనిపోయి ఉండేవాడిని’’ అన్నారు. అయితే ఆయన సెప్టెంబర్ 13 సుప్రీంకోర్టు ఉత్తర్వు మేరకు బెయిల్ పై విడుదలయ్యారు.

బిజెపి కి ప్రచారం చేస్తా…

దేశంలో ఎన్ డిఏ పాలిత ప్రాంతాలంతటా ఉచిత విద్యుత్తు అందించేట్లయితే బిజెపి తరఫును, బిజెపికి మద్దతుగా ప్రచారం చేస్తానన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బిజెపి ఉచిత విద్యుత్తు ఇస్తే తప్పక బిజెపికి ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.

‘‘పదేళ్లలో పదవిలో ఉన్నప్పటికీ ప్రధాని ఏమీ చేయలేదని ప్రజలు అంటున్నారు. ఆయన ఇప్పడైనా, గత ఏడాదైనా ఏదైనా చేసి ఉన్నట్లయితే ఆయన ఏదో చేశారని ప్రజలు చెప్పేవారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్నాయి. 22 రాష్ట్రాల్లో విద్యుత్తును ఉచితం చేయమని నేనాయనను అడుగుతున్నాను. అలా చేసినట్లయితే నేను ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తాను అని ఢిల్లీలోని ఛత్రసల్ స్టేడియంలో జరిగిన ‘జనతా కీ అదాలత్’ కార్యక్రమంలో ఆయన చెప్పారు. ‘‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే డబుల్ లూట్; డబుల్ కర్రప్షన్’’ అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా తయారవుతోందని అన్నారు. 1990 దశకంలో ముంబైలో అండర్ వరల్డ్ రాజ్యమేలినట్లుగా నేడు ఢిల్లీలో పరిస్థితి ఉందన్నారు. ‘‘ప్రతి రోజూ బుల్లెట్లు పేలుతున్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వంని పనిచేయనివ్వకుండా బిజెపి బిజీగా ఉంది. మేము మహిళలను రక్షించేందుకు బస్ మార్షల్స్ ను ప్రవేశపెట్టాము. కానీ వారు దాన్నికూడా ఆపేశారు’’ అని కేజ్రీవాల్ వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News