Friday, December 20, 2024

ఢిల్లీ తిరిగి వచ్చిన కేజ్రీవాల్..

- Advertisement -
- Advertisement -

హోషియార్‌పూర్: పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో 10 రోజుల విసాసన ధ్యాన కార్యక్రమాన్ని ముగించుకుని తాను ఢిల్లీకి తిరిగివచ్చానేని, ఇక మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమవుతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. ఎక్సైజ్ పాలసీతో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో జనవరి 3న తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఆప్ అధినేతకు సమన్లు జారీచేసింది. హోషియార్‌పూర్‌కు 11 కిలోమీటర్ల దూరంలోని ఆనందగఢ్ వద్ద ఉన్న ధమ్మ ధజ విపాసన కేంద్రానికి డిసెంబర్ 20న కేజ్రీవాల్ చేరుకున్నారు. విపాసన ధ్యానాన్ని ముగించుకుని 10 రోజుల తర్వాత నేడే తిరిగివచ్చానని, ఈ సాధన తనకు అమిత శాంతిని కలుగచేస్తుందని శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ఈరోజు నుంచి మళ్లీ కొత్త శక్తితో ప్రజలకు సేవ చేయడం ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. పంజాబ్‌లో విపాసన కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొనడం ఇదే మొదటిసారి. గతంలో ఆయన జైపూర్, నాగ్‌పూర్, ధరమ్‌కోట్, బెంగళూరులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పదిరోజుల ధ్యాన కార్యక్రమంలో పాల్గొనేవారు ఎవరైనా ధ్యాన కేంద్రం నిబంధనలకు లోబడి గడపాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్‌నెట్, టెలివిజన్, వార్తాపత్రికలకు దూరంగా ఉండాలి. దైనందిన జీవితం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై రాత్రి 9.30 గంటలకు ముగుస్తుంది. ఆహార నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. చాలా సాదాసీదా భోజనం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఆహారం ఏదీ తీసుకోరాదని ధ్యాన కేంద్రం ప్రతినిధి ఒకరు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News