Sunday, January 19, 2025

కేజ్రీవాల్‌కు 14 రోజుల జుడిషియల్ రిమాండ్

- Advertisement -
- Advertisement -

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఢఙల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రత్యేక కోర్టు జులై 12వ తేదీ వరకు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది. మూడు రోజుల కస్టోడియల్ ఇంటరాగేషన్ ముగిసిన అనంతరం కేజ్రీవాల్‌ను సిబిఐ అధికారులు శనివారం కోర్టు ఎదుట హాజరుపరిచారు. కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు జైలులో ఉంచాలని సిబిఐ కోరగా ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ అంందుకు అంగీకరిస్తూ జులై 12న కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచాలని కోరారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలనీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేజ్రీవాల్‌ను సిబిఐ అరెస్టు చేసింది. అదే ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేసింది. ఆయనకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఢిల్లీ హైకోర్టు దానిపై స్టే ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News