Sunday, January 19, 2025

జులై 12 వరకు జుడీషియల్ కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

జుడీషియల్ కస్టడీ ఇంటరాగేషన్ మూడు రోజుల వ్యవధి ముగియడంతో సిబిఐ కేజ్రీవాల్ ను కోర్టు ముందు ప్రవేశపెట్టింది.

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ కోర్టు జులై 12 వరకు జుడీషియల్ కస్టడీకి పంపింది. పరిశోధన అధికారులు సేకరించిన వివరాలను వెల్లడించాలని ఆయన పెట్టుకున్న వినతిని కోర్టు తిరస్కరించింది.

మూడు రోజుల కస్టోడియల్ ఇంటరాగేషన్ గడువు ముగియడంతో కేజ్రీవాల్ ను వెకేషన్ కోర్టు జడ్జీ సునేనా శర్మ ముందు హాజరుపరిచారు. ఆయన్ని జుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ పెట్టుకున్న వినతిని జడ్జీ సునేనా శర్మ అనుమతించారు. కేజ్రీవాల్ ను జూన్ 26న లాంఛనంగా అరెస్టు చేశారన్నది తెలిసిందే.

కేజ్రీవాల్ తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టులో ఈ కేసు పరిశోధన 2022 ఆగస్టు నుంచి కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. మార్చి 21న మొదట ఈడి ఆయన్ని అరెస్టు చేసింది. తర్వాత మే 10న మూడు వారాల పాటు తాత్కాలిక బెయిల్ ను ఆయనకు కోర్టు మంజూరు చేసింది. ఆ తర్వాత సిబిఐ తమకు కొన్ని ఆధారాలు దొరికాయని కోర్టుకు తెలిపింది.

ఒకవేళ సిబిఐ మూడు విషయాల్లో కోర్టును సంతృప్తి కలిగించకపోతే కేజ్రీవాల్ రిమాండ్ ప్రొసీడింగ్స్ అక్రమమే అవుతాయని కేజ్రీవాల్ న్యాయవాది విక్రమ్ చౌదరి అన్నారు. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుటుంబం ఆయనని కలవడానికి కోర్టు అనుమతించాలని కూడా కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News