Monday, December 23, 2024

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని బుధవారం కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఐదుసార్లు నోటీసులు ఇచ్చినా.. సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని.. తమకు సహకరించడం లేదంటూ ఈడీ అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు.. విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ ను ఆదేశిస్తూ సమన్లు పంపింది.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందని భావిస్తున్న ఈడీ.. విచారణకు హాజరుకావాలని ఆయనకు ఐదుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే, ఆయన మాత్రం తనకు వేరే పనులు ఉన్నాయంటూ ఒక్కసారి కూడా హాజరుకాలేదు. మరోవైపు కేంద్రం, ఈడీని అడ్డంపెట్టుకుని కేజ్రీవాల్ ను వేధిస్తుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News