Wednesday, April 2, 2025

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Arvind Kejriwal Tests Positive For Covid-19

న్యూఢిల్లీ : కొవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్ ఉన్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం వెల్లడించారు. అయితే కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్టు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తాను ఇంటివద్దనే ఐసొలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్ రావడం ఇది మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌కు పాజిటివ్ కనిపించింది. అయితే కేజ్రీవాల్‌కు మాత్రం అప్పుడు కరోనా నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు కుటుంబం అంతా పరీక్షలు చేయించుకోవలసి ఉంది. కేజ్రీవాల్ తోపాటు కుటుంబీకులంతా ఐసొలేషన్‌లో ఉన్నారు. ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్ లో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించిన మరునాడే కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్ కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News