Sunday, April 6, 2025

ప్రధాని మోడీకి కేజ్రీవాల్ ధన్యవాదాలు

- Advertisement -
- Advertisement -

Arvind Kejriwal thanks PM Modi

ఆప్‌కు శుభాకాంక్షలు చెప్పిన మోడీ

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విజయ పతాకాన్ని ఎగురవేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. కాగా..తమ పార్టీకి అభినందనలు తెలియచేసిన ప్రధానికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాద్ ధన్యవాదాలు తెలియచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గురువారం రాత్రి ప్రధాని మోడీ ఆప్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్ చేశారు. పంజాబ్ ఎన్నికల్లో గెలుపొందినందుకు ఆప్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని, పంజాబ్ సంక్షేమానికి కేంద్రం నుంచి తగిన సహకారం ఉంటుందని ప్రధాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందుకు స్పందిస్తూ థ్యాంక్ యు సర్ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News