న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం 4గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు గత కొన్నిరోజులుగా దారుణంగా తయారయ్యాయి. కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రోజువారీ కేసులు పెరిగాయి. దేశంలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ నెల 4వ తేదీన ముంబైలో అత్యధికంగా 11,163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో బుధవారం ఒకేరోజు 17వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. గత 24గంటల్లో 100మంది కోవిడ్ తో మృతిచెందారు. దేశంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఢిల్లీలో వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 11వేల మందికి పైగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో రోజు లక్ష కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
Arvind Kejriwal to hold meeting over COVID-19