Sunday, January 19, 2025

జూన్ 2న తిరిగి లొంగిపోనున్న అరవింద్ కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాను ఆదివారం తీహార్ జైలు పోలీసుల ఎదుట లొంగిపోతానని తెలిపారు. ఆయన ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ పై బయట ఉన్నారు. తనకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన అనేక ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకున్నారు. తన తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఢిల్లీ ప్రజలను కోరారు.

ఎన్నికల ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు 21 రోజుల బెయిల్ మంజూరు చేసింది. ఆయన రేపు తిరిగి తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ‘‘నన్ను వారెంత కాలం జైలులో ఉంచుతారో తెలియదు. ఇప్పటికీ నా ధైర్యం తగ్గలేదు. నిరంకుథ నాయకత్వం నుంచి దేశాన్ని రక్షించేందుకు నేను జైలుకు వెళతాను. నన్ను అణచివేయడానికి వారు అనేక రకాలుగా ప్రయత్నించారు. కానీ వారు విజయం సాధించలేదు. నేను జైలులో ఉన్నప్పుడు వారు నన్ను అనేక రకాలుగా చిత్ర హింసలు పెట్టారు. నాకు మందులు అందకుండా చేశారు. వారికేమి కావాలో నాకైతే తెలియదు. వారెందుకు ఇలా చేస్తున్నారో కూడా నాకు తెలియదు’’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News