న్యూఢిల్లీ: పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కేసులు ఎక్కువున్న రాష్ట్రాల సిఎంలతో పిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆక్సిజన్ కొరత సమస్య అంశాన్ని సిఎం కేజ్రీవాల్ లేవనెత్తారు. ఢిల్లీలో ఆక్సిజన్ నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రధానితో కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ఉత్పత్తి ప్లాంట్ లేకపోతే ఆక్సిజన్ అందదా..? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్లు ఆపేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రంలో ఎవరితో మాట్లాడాలో చెబితే సంప్రదిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతను తీర్చడానికి పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి ఆక్సిజన్ ఎయిర్‌లిఫ్టింగ్‌కు వీలు కల్పించాలని పిఎం మోదీని కేజ్రీవాల్ కోరారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఘోరంగా విస్తరిస్తోంది. భారత్ 24 గంటల్లో 3.32 లక్షల కోవిడ్ కేసులు, 2,263 మరణాలు నమోదయ్యాయి.
Arvind Kejriwal with PM on Oxygen Crisis