Saturday, January 4, 2025

అక్కడ బిజెపి డబ్బులు పంచుతోంది.. సపోర్ట్ చేస్తారా?: ఆర్ఎస్ఎస్ కు కేజ్రీవాల్ లేఖ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మారోసారి బీజేపీపై ఫైరయ్యారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ నగదు పంపిణీ చేస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కు కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ సందర్భంగా బిజెపిపై పలు ప్రశ్నలు సంధించారు.

“గతంలో బీజేపీ ఏ తప్పు చేసినా ఆర్‌ఎస్‌ఎస్ మద్దతిస్తుందా?. బీజేపీ నేతలు బాహాటంగానే డబ్బులు పంచుతున్నారు.. ఓట్లను కొనుగోలు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇస్తుందా?. దళితులు, పూర్వాంచలీల ఓట్లను పెద్ద ఎత్తున కోత పెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి సరైనదని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తుందా?. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్‌ భావించడం లేదా?” అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News