Wednesday, January 22, 2025

బిభవ్ కుమార్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ పై దౌర్జన్యం చేసినందుకు ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ బిభవ్ కుమార్ ను అరెస్టు చేశారు. అతడు తనను కొట్టాడని, పొత్తికడుపులో తన్నాడని స్వాతి మాలివాల్ ఆరోపించింది. ఐపిసి సెక్షన్ కింద ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్ పై కేసు నమోదు చేశారు.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం బిభవ్ కుమార్ కు అండగా బలంగా నిలబడింది. బిజెపి ప్రోద్బలంతో స్వాతి మాలివాల్ కావాలనే అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తోందని అంటోంది.  ఓ పాత ఏసిబి కేసు లివరేజ్ తో ఎఫ్ఐఆర్ దాఖలు చేయమని బిజెపి స్వాతి మాలివాల్ ను పురిగొల్పిందని శనివారం ఢిల్లీ మంత్రి ఆతిషి అన్నారు. ఇదిలావుండగా బిభవ్ కుమార్ కూడా స్వాతి మాలివాల్ తనను కావాలని రెచ్చగొట్టిందంటూ ఫిర్యాదు దాఖలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News