Thursday, January 23, 2025

నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి బిభవ్ కుమార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్వాతి మాలివాల్ దాడి కేసులో నిందితుడిగా ఆరోపితుడైన కేజ్రీవాల్ అసిస్టెంట్ బిభవ్ కుమార్ ను ఢిల్లీ తీస్ హజారీ కోర్టు నాలుగు రోజలు జుడీషియల్ కస్టడీకి పంపించింది. ఆయనని మళ్ళీ మే 28న కోర్టు ముందు హాజరుపరుస్తారు. ఇదిలావుండగా బిభవ్ న్యాయవాదులు సిసిటివి ఫుటేజ్, డివిఆర్ లు సేకరించి భద్రపరచమని దరఖాస్తు చేసుకున్నారు.

‘‘ ఈ సిసిటివి ఫుటేజ్ లు కేసును రుజువు చేస్తాయి. వారు అనేక సార్లు సోదాలు చేసి సిసిటివి ఫుటేజ్ లు తీసుకెళ్లారు. ఎన్ని ఫుటేజ్ లు ఉన్నాయన్నది మాకు తెలియదు. కానీ ఆ ఫుటేజ్ లను భద్రపరచాలని మేము కోరుతున్నాము’’ అని బిభవ్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. కానీ వారికి ప్రతికూలంగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మాలివాల్ అక్రమంగా ప్రవేశించిందని, పైగా తనని వ్యక్తిగతంగా దూషించిందని బిభవ్ ప్రతి ఫిర్యాదును దాఖలు చేశారు. కాగా ఢిల్లీ పోలీసులు భిభవ్ కుమార్ ను గత వారం అరెస్టు చేశారు.

స్వాతి మాలివాల్ తన ఆరోపణలో బిభవ్ కుమార్ తనను ఏడెనిమిది సార్లు  చెంప పగుల కొట్టాడని, తాను ఏడ్చినా, లాగిపారేశారని, ఛాతీ, కడుపు, పొత్తి కడుపులో తన్నారని మే 13న ఫిర్యాదు  చేసింది.

పెండింగ్ క్రిమినల్ కేసులో విజిలెన్స్ డిపార్ట్ మెంట్ బిభవ్  కుమార్ ను గత నెల సర్వీసుల నుంచి తొలగించింది. బిభవ్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు పర్సనల్ అసిస్టెంట్(పిఏ).

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News