Friday, April 25, 2025

కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీ మే 20 వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు విధించిన కస్టడీ గడువు ముగిసిపోవడంతో మంగళవారం కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా సిబిఐ, ఇడి కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఎదుట పోలీసులు హాజరుపరచగా మే 20 వరకు కస్టడీని పొడిగిస్తూ ఆమె ఉత్తర్వులు జారీచేశారు. ఆయనతోపాటు సహ నిందితుడు చన్‌ప్రీత్ సింగ్ జుడిషియల్ కస్టడీని కూడా మే 20 వరకు న్యాయమూర్తి పొడిగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News