Tuesday, January 21, 2025

‘కస్టడీ’ చిత్రం నుంచి అరవింద్ స్వామి పోస్టర్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.ఇటీవల విడుదలైన చిన్న గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కృతి శెట్టి పాత్ర పోస్టర్ కూడా క్యురియాసిటీని పెంచింది. ఈ రోజు మేకర్స్ ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి పాత్ర పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో రాజు అలియాస్ రాజు (Raju aka Raazu) పాత్ర పోషిస్తున్నారు.

అతని లుక్ చాలా పవర్ ఫుల్ గా వుంది. సంకెళ్లతో బార్స్ వెనుక కనిపిస్తున్నారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో బలమైన పాత్ర పోషిస్తున్నారని ఈ పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. ఈ ఫెరోసియష్ లుక్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై అంచనాలను పెంచింది. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News