Monday, December 23, 2024

కాంగ్రెస్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడుగా అర్విందర్ సింగ్ లవ్లీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ విభాగం కాంగ్రెస్ అధ్యక్షుడుగా అనిల్ చౌదరిస్థానంలో అర్విందర్ సింగ్ లవ్లీ గురువారం నియామకమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్రాల విభాగాల పునర్వవస్థీకరణలో భాగంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ మార్పు చేశారు. తన నియామకం తరువాత అర్విందర్ సింగ్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీకి, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఢిల్లీలో కాంగ్రెస్ పటిష్ఠానికి గట్టిగా పనిచేస్తానన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ మాజీ అధ్యక్షులు చాలా గట్టిగా పనిచేసారని, ప్రజలు కాంగ్రెస్ బలోపేతానికి పనిచేస్తున్నారని తెలిపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన అర్విందర్ సింగ్ లవ్లీ 2017లో బీజేపీలో చేరారు. తరువాత కొన్ని నెలలకే తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇంతవరకు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేసిన అనిల్ చౌదరి సేవలను పార్టీ ప్రశంసించిందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జి కెసి వేణుగోపాల్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News