- Advertisement -
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆర్య2. 2009లో విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.యూత్ ను బాాగా ఆకట్టుకుంది. అయితే.. ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆర్య 2 సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇక, ఈ మూవీని ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్.. ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఆర్య 2 మూవీ రీ రిలీజ్ తో స్టార్ట్ చేసేందుకు ఇప్పటి నుంచే సిద్దమవతున్నారు.
- Advertisement -