Monday, January 20, 2025

నా జీవితాన్ని మార్చేసిన ‘ఆర్య’: అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్య’. సుకుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2004 మే 7న ఈ మూవీ రిలీజైంది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా విడుదలై 20 ఏళ్లు అయ్యింది. ఈ స్పెషల్ మూమెంట్స్‌ను చిత్ర యూనిట్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, శివ బాలాజీ, సుబ్బరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. “ఆర్య స్క్రిప్ట్‌ని నేను, వేమ కలిసి రాశాం. నా కథను నమ్మి, దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దిల్ రాజుకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఆర్య సినిమా రూపొందటానికి రెండో కారణం బన్ని. తనే కథను వదలకుండా కూర్చుని సినిమా చేసుకున్నాడు. రీల్ లైఫ్, రియల్ లైఫ్‌లో నేను ఇలా నిలబడి ఉన్నానంటే బన్నీనే కారణం”అని అన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “ఆర్య నా జీవితాన్ని మార్చేసిన సినిమా అని చెబుతాను. సుకుమార్ అత్యద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News