Saturday, November 9, 2024

అర్యవైశ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

- Advertisement -
- Advertisement -
  • ఆర్యవైశ్యులకు ఆత్మీయ మిత్రుడు సిఎం
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్

అచ్చంపేట రూరల్: ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారని, ముఖ్యమంత్రిని మెప్పించి ఆర్యవైశ్యుల ఆకాంక్ష అయిన కార్పొరేషన్ వచ్చేలా కృషి చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ అన్నారు. బుధవారం అచ్చంపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో అచ్చంపేట ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

అచ్చంపేట అధ్యక్షుడు బంధం రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా కమిటీ చైర్మెన్ మిడిదొడ్డి శ్యామ్ సుందర్, జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి చంద్రకుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఆర్యవైశ్యులలో 30 శాతం ఇంకా వెనుకబడిన వారు ఉన్నారని అన్నారు. వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన 10 సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యులకు అండగా ఉన్నానని అన్నారు. ఎల్లప్పుడు వైశ్యులకు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రాష్ట్రంలో అందరికి భిన్నం ఆర్యవైశ్యులని, వైశ్యులలోని పేదలను ఆదుకునేందుకు కార్పొరేషన్ అవసరం ఉందని అన్నారు. వైశ్యులకు రాష్ట్రంలో ఏ సమస్య లేకుండా రాష్ట ప్రభుత్వ పనిచేస్తుందని అన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తెస్తే పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చి రాబోయే రోజుల్లో తనకు అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా మిడిదొడ్డి శ్యాం సుందర్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అందిస్తున్న సహాయ సహకారాలు వివరించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుతో మేలు జరుగుతుందని చెప్పారు.

జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ వైశ్యుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేయడంతో పాటు ప్రభుత్వ పథకాలలో అవకాశం కల్పిచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శివ జగదీశ్వర్, అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, సత్యనారాయణ, సంభు వెంకటరమణ, జిల్లా రైస్ మిల్లర్ల అసొసియేషన్ కార్యదర్శి గుడిపల్లి రవి, మిరియాల రాజయ్య, మార్కెట్ చైర్మెన్ అరుణ, ఉమామహేశ్వర దేవస్థానం చైర్మెన్ కందూరు సుధాకర్, మెడిశెట్టి సురేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News