Monday, December 23, 2024

ఆర్యవైశ్యులు సామాజిక సేవలోనూ ముందుంటారు

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ సాకారంతో త్వరలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆశాభావం

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్యవైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు,జాతీయ ప్రధాన కార్యదర్శి , తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఆర్యవైశ్య యువత వ్యాపారంలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా రాణించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ – ఐవిఎఫ్ (IVF) హర్యానా రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ లో ఐవిఎఫ్ హర్యానా రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం నాడు నిర్వహించారు.

ఐవిఎఫ్ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు రామ్ నివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ రాష్ట్ర ,జిల్లా, గ్రామస్థాయిలో ఐవిఎఫ్ బలోపేతానికి ఆర్యవైశ్య యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాజకీయాలలో కూడా రాణించాలని ఈ సందర్భంగా అన్నారు. ఎటువంటి పదవులు ఇచ్చినా నీతి నిజాయితీతో కష్టపడి పని చేస్తారని అన్నారు. సిద్దిపేట ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రి కెసిఆర్ కోటి రూపాయలు ఇచ్చి అయినా కోమట్లతో సోపతి చేయమని అన్నారని గుర్తుచేశారు. అన్ని కులాలు,మతాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఒక్క ఆర్యవైశ్య కులానికి మాత్రమే ఉంటుందని అన్నారు. అన్ని కులాల బాగు కోసం కృషి చేస్తున్నట్లుగానే ఆర్యవైశ్య జాతి పేదల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నదని, త్వరలోనే వైశ్య కార్పొరేషన్ కూడ సిఎం కెసిఆర్ నాయకత్వంలో సాకారం కావడం ఖాయమని భావిస్తున్నానని ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐవిఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ అశోక్ అగర్వాల్ , ఐవిఎఫ్ సెంట్రల్ సీనియర్ ప్రెసిడెంట్ సురేందర్ గుప్తాలతో పాటు ఐవిఎఫ్ సెంట్రల్ ట్రెజరర్ దినేష్ గుప్తా , ఐవిఎఫ్ హర్యానా ప్రెసిడెంట్ రామ్ నివాస్ , మహిళా ఐవిఎఫ్ హర్యానా ప్రెసిడెంట్ సోనియా అగర్వాల్ ఇంకా ఐవిఎఫ్ -డిస్ట్రిక్ట్ అధ్యక్షులు, కార్యదర్శిలు రాష్ట్ర కమిటీ సభ్యులు, మహిళ విభాగం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News