మరిపెడ: సామాజిక సేవలో ఆర్యవైశ్యులు ముందుండాలని వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ రవ్వ గీత అన్నారు. ఆదివారం వాసవి క్లబ్ మరిపెడ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వాసవి క్లబ్ భవన్‌లో డాన్ టూ డస్క్ కార్యక్రమాన్ని నిర్వహించి పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాసవి క్లబ్ మరిపెడ ఆధ్వర్యంలో సామాజిక సేవలు చేయడం అమోఘం, అభినందనీయమన్నారు. సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలన్నారు. అనంతరం పేద ఆర్యవైశ్య సభ్యునికి బియ్యం, కిరాణా సామాన్లు, రైతుకి విత్తనాలు, బీదవారికి దుప్పట్లు ఉచితంగా పంపిణీ చేశారు.
అనంతరం రక్షక్ష మిత్రుల సన్మాన కార్యక్రమంలో భాగంగా స్ధానిక కానిస్టేబుల్‌కి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు ఉప్పల రాంబాబు, సెక్రటరి గర్రెపల్లి వెంకన్న, బోనగిరి సురేష్, దారం నాగేశ్వర్‌రావు, ఉల్లి శ్రీనివాస్, వంగపల్లి భరత్ కుమార్, గర్రెపల్లి జానకీరామయ్య, బోనగిరి రాజేశ్వరి, గర్రెపల్లి మంజులాదేవి, సంక నాగయ్య, గర్రెపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.