Tuesday, November 5, 2024

ఆర్యవైశ్యులు సేవకు మారుపేరు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : ఆర్య వైశ్యులు సేవకు మారుపేరని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దేశ వ్యాప్తంగా నిత్యాన్నదాన సత్రాలు, ఆరో గ్య శిబిరాలు, పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడిలో ఉన్న వాసవీ కళ్యాణ మం డపంలో ఆర్య వైశ్య సంఘం , యశోదా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను మంత్రి ప్రారంభించారు.

తెల ంగాణ ప్రభుత్వం ఏర్పడినాటికి మహబూబ్‌నగర్‌లో వివిధ ర కాల వ్యాపారాలు చేసుకునే వారి పట్ల దౌర్జన్యాలు ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్భయంగా వ్యాపారా లు చేసుకునే పరిస్థితి తీసుకువచ్చామని తెలిపారు. ఒకప్పుడు రైస్ మిల్లులు, వివిధ పరిశ్రమలు నిర్వహించేవారు కనీసం ఈ అమ్మాయిలు కట్టే పరిస్థితి కూడా ఉండేది కాదని , స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి కష్టాలు తీరాయన్నారు.

ఆర్యవైశ్య సం ఘం ఆధ్వర్యంలో జరిగే అన్ని సేవా కార్యక్రమాలకు అండగా ఉంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మా ర్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, ఆర్యవైశ్య నాయకులు ప్రమోద్ , వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News