Thursday, January 23, 2025

తెలంగాణ ఇన్‌లైన్ హాకీ కెప్టెన్‌గా ఆర్యన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ ఇన్‌లైన్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే తెలంగాణ పురుషుల జట్టును ఎంపిక చేశారు. జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఇన్‌లైన్ హాకీ పోటీల్లో తలపడుతున్న తెలంగాణ జట్టుకు ఆర్యన్ కర్రా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. చండీగఢ్‌లో వేదికగా డిసెంబర్ 11 నుంచి 25 వరకు ఈ టోర్నమెంట్ జరుగనుంది. ఇందులో పాల్గొనే తెలంగాణ పురుషుల టీమ్‌ను ఎంపిక చేశారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆర్యన్ కర్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ఛాంపియన్‌షిప్ కోసం మొత్తం 12 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. సాయి కుమార్ (రంగారెడ్డి), మణికంఠ (రంగారెడ్డి) గోల్ కీపర్లుగా ఎంపికయ్యారు. ఆర్యన్ కర్రాతో పాటు తరుణ్ తేజ, భార్గవ రాజేశ్, సుబ్రమణ్యం, మణికొండ సాయి విఘ్నేష్, గుమ్మడి భరత్, సయ్యద్ గౌస్, సృజన్ రెడ్డిలు తెలంగాణ సీనియర్ పురుషుల టీమ్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News