Friday, November 22, 2024

ఆర్యన్ ఖాన్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -
aryan khan gets bail after 3 weeks
రేపు సమగ్ర ఉత్తర్వులు, తరువాతే బంధవిముక్తి

ముంబై : హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు సంచలనపు డ్రగ్స్‌కేసులో గురువారం బెయిల్ లభించింది. మూడు వారాలకుపైగా జైలు తరువాత ఆర్యన్‌కు ఇప్పుడు బొంబాయి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం న్యాయమూర్తి ఎన్ డబ్లు సాంబ్రే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అయితే బొంబాయి హైకోర్టు బెయిల్‌కు సంబంధించి శుక్రవారం అధికారిక ఆదేశాలు వెలువరించిన తరువాతనే ఆయన లాయర్ల బృందం జైలు నుంచి విడుదలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది. బెయిల్‌కు సంబంధించి తాము శుక్రవారం పూర్తి స్థాయి ఆదేశాలను వెలువరిస్తామని జడ్జి తెలిపారు. దీనితో ఆర్యన్ మరో రాత్రి కూడా జైలులోనే గడపాల్సి వచ్చింది. 23 సంవత్సరాల ఆర్యన్ క్రూయిజ్ రేవ్ పార్టీ ఉదంతంలో పట్టుబడి ఈ నెల 3వ తేదీనుంచి కస్టడీలో ఉన్నారు. రేవ్ పార్టీ సమాచారంతో మాదకద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్‌సిబి) నౌకలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో ఆర్యన్ ఇతరులపై డ్రగ్స్ సేవనంలో ఉన్నట్లు కేసుల దాఖలకు దారితీసింది.

అక్టోబర్ 8 నుంచి ఆర్యన్ స్థానిక అర్థూర్ రోడ్ జైలులో ఉండాల్సి వచ్చింది. ఆయనకు ఇంతకు ముందు రెండుసార్లు బెయిల్ రాలేదు. తమ క్లయింట్ వద్ద అసలు డ్రగ్స్‌లేవని, అసంబద్ధ కారణాలతో అరెస్టుకు దిగారని ఆయన తరఫు సీనియర్ లాయర్లు వాదించారు. దీనిని ఎన్‌సిబి తీవ్రంగా వ్యతిరేకించింది. డ్రగ్స్ సంబంధిత కుట్రలో ఆర్యన్ ప్రధాన పాత్రధారి అని, ఆయన వాట్సాప్ ఛాట్స్ వివరాలలోకి పోతే ఆయన సాగిస్తున్న అక్రమ డ్రగ్స్ రవాణా లావాదేవీలు తేలుతాయని ఎన్‌సిబి వాదించింది. ఆర్యన్ స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మోడల్ మున్ముమ్ ధమేచా కూడా ఈ దఫా బెయిల్ పొందారు. తమ క్లయింట్స్‌కు బెయిల్ వచ్చినందున వెంటనే విడుదల ఏర్పాట్లు జరగాలని ఆర్యన్ తరఫు లాయర్లు అభ్యర్థించారు. క్యాష్ బెయిల్‌కు అనుమతించాలని కోరారు. కానీ ఇందుకు కోర్టు సమ్మతించలేదు. పూర్తిస్థాయి ఆదేశాల తరువాతనే ష్యూరిటీ ఇవ్వడానికి వీలుంటుందని తెలిపింది. తాను బెయిల్ ఆర్డర్‌ను శుక్రవారం ఇచ్చి ఉండేవాడినని, అయితే ముందస్తు సమాచారంగా దీనిని ఇప్పుడు బెయిల్ మంజూరు విషయం తెలియచేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News