ముంబై: హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యాడు. శనివారం ఉదయం బెయిల్ పై అర్థర్ రోడ్డు జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదలయ్యాడు. ముంబయిలో క్రూయిజ్ రేవ్ పార్టీ డ్రగ్స్‌కేసులో మాదకద్రవ్యాల నిరోధక సంస్థ (ఎన్‌సిబి), 23 సంవత్సరాల ఆర్యన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 3వ తేదీ నుంచి ఆర్యన్ కస్టడీలో ఉన్నాడు. బెయిల్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా లభించలేదు. ఈ క్రమంలో గురువారం ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. మూడు వారాలకుపైగా జైలు తరువాత ఆర్యన్‌కు ఇప్పుడు బొంబాయి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం న్యాయమూర్తి ఎన్ డబ్లు సాంబ్రే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, బొంబాయి హైకోర్టు బెయిల్‌కు సంబంధించి శుక్రవారం అధికారిక ఆదేశాలు వెలువరించిన తరువాతనే ఆయన లాయర్ల బృందం జైలు నుంచి విడుదలకు దరఖాస్తు చేసుకోవాల్సివుండడంతో ఆర్యన్ మరో రాత్రి కూడా జైలులోనే గడపాల్సి వచ్చింది.
Aryan Khan released from Jail