Monday, December 23, 2024

కెసిఆర్ ఉన్నంత వరకూ సింగరేణి మనదే : మంత్రి జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నంత వరకూ సింగరేణి మనదే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.శనివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని సింగరేణి ప్రాంతంలో ఉన్న నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారా కేటాయింపులకు అవకాశం ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ,సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని గోదావరి వ్యాలీలో ఉన్న బోగ్గు గనుల ప్రాంతాల రిజర్వేషన్లు, కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల మంత్రిత్వశాఖను అభ్యర్దించారని తెలిపారు.

అయితే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు కేటాయింపులను ఒప్పుకోలేదని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను బ్రతికించుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో కెసిఆర్ ఒక్కరే అన్నారు. బొగ్గు గనుల నిభంధనలు కోల్ ఇండియా వారే రూపొందించారని తెలిపారు. సింగరేణి గనులు వేలం వేసే అధికారం ఎవరికీ లేదన్నారు. భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని, ఆర్‌ఆండ్ ఆర్ కింద భూముల పరిహారం కూడా కలెక్టర్ల వద్ద నిధులు జమ చేసినట్టు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News