Friday, December 20, 2024

అసెంబ్లీ సాక్షిగా అన్ని అబద్దాలే

- Advertisement -
- Advertisement -

తిమ్మాపూర్: అసెంబ్లీ సాక్షిగా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్ని అబద్దాలే ఆడారని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే రసమయి తీరును నిరసిస్తూ నుస్తులాపూర్ గ్రామంలోని కరీంనగర్ హైదరాబాద్ రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మానకొండూర్ నియోజకవర్గంలో ఎంతో గొప్పగా అభివృద్ధి జరిగిందంటూ ఎమ్మెల్యే రసమయి అసెంబ్లీలో పేర్కొనడం హాస్యా స్పదమని అన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటుంటే వారి గురించి ఎంతమాత్రం ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

స్థానికేతరుడైన రసమయికి నియోజకవర్గం అభివృద్ధి ఏమాత్రం ఇ ష్టం లేదనీ, రానున్న రోజుల్లో ప్రజలు ఆయన్ను నియోజకవర్గం నుంచి తరి మికొడతారని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చే సేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని వారిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపెల్లి సంపత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, సీనియర్ నాయకుడు గంకిడి లకా్ష్మరెడ్డి, డీసీసీ ఆఫీస్ ఇన్చార్జి గోపు మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చెన్నబోయిన రవి, మండల కో ఆర్డినేటర్ సమద్, నాయకులు రెడ్డిగాని రాజు, రావుల శ్రీనివాస్ గౌడ్, తూముల శ్రీనివాస్, ముంజ శ్రీకాంత్ గౌడ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News