కాచిగూడ : గద్దర్ ఏ ఒక్క వర్గానికి, భావజాలానికి మా త్రమే పరిమితం కాలేదని, ఆయన పాట, మాట, ఆటతో.. జన హృదయాల విజేతగా చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపాధ్యక్షుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ కొని యా డారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో ప్రజా వాగ్గేయ కారుడు గద్దర్ సంతాప సభ బుధవారం గానసభలోని కళాలలితకళావేదికలో నిర్వహి ం చారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరై..గద్దర్ చిత్రపటాని కి పూల మాలలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు.
కొలకలూరి ఇనాక్ తనకు గద్దర్‌తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ గద్దర్ సాహిత్యం సిలబస్‌గా పెట్టే ప్రయత్నంలో ఎదుర్కొన్న అనుభవాలు తెలిపారు. గద్దర్‌లో విప్లవభావాలు, తెలంగాణ భావన దళిత వర్గాల అభ్యుదయం పట్ల అలోచనలు నేటి తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఏహ్యాత కలగ లిసి కొత్త పార్టీ ఆలోచన చేశారన్నారు. ఆయన జీవించి ఉంటే తప్పక సామాజి క మార్పు వచ్చేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలంగాణ సా హిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌ రీశంకర్ మాట్లాడుతూ.. గొంగళి, గజ్జలు, ఎర్ర తువ్వల చేతికర్రతో గద్దర్ రూపం గోచరిస్తుందనీ ఆయన చైత న్య స్వరం ఊర్రుతలూగిస్తుందన్నారు. నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి ప్రపంచ జానపద గాయకుని స్థాయికి ఎదిగిన గద్దర్ పాట ఉన్నం తకాలం చిరస్థాయిగా నిలిచిఉంటారని పేర్కొన్నారు.
గానసభ అధ్యక్షుడు కళా జనార్ధనమూర్తి సభాధ్యక్షత వహించి మాట్లాడుతూ..గద్దర్ గొప్ప కళాకారుడు అయినా అందరిని ఆప్యాయంగా పలుకరించే మానవతామూర్తి అ ని, ఆయన జయంతి ప్రతిఏటా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బెవరేజెస్ పూర్వ చైర్మన్ దేవిప్రసాద్, పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చై ర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, రామిరెడ్డి, జగన్, శ్రీనివాస్ తదితరులు పా ల్గొని మాట్లాడారు.