Thursday, January 23, 2025

3వ నెలలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ యుద్ధం!

- Advertisement -
- Advertisement -

Ukraine

కీవ్: ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మూడవ నెలలో ప్రవేశించినందున అమెరికా ఉన్నత స్థాయి అధికారులు విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్,  రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్  యుద్ధంలో దెబ్బతిన్న దేశ రాజధాని కైవ్‌ను సందర్శించారు. తాజా సైనిక సాయాన్ని అందిస్తామని కూడా చెప్పారు. రాబోయే రోజుల్లో 165 మిలియన్ల డాలర్ల మందుగుండు సామగ్రి విక్రయం, దౌత్యవేత్తలు తిరిగి రావడంపై  కూడా హామీ ఇచ్చారు. నివేదికల ప్రకారం దాదాపు 2,000 మంది ఉక్రేనియన్ యోధుల స్వాధీనంలో  ఉన్న కీలకమైన ఓడరేవు నగరం ‘మారియుపోల్’ యొక్క అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్‌ వద్ద పోరాటం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, రెండు నెలల యుద్ధంలో రష్యా 21,000 మంది సైనికులను కోల్పోయింది.

ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ వారం రష్యా,  ఉక్రెయిన్ అధ్యక్షులను కలవనున్నారు. అయితే, అతను మొదట కైవ్‌కు వచ్చి ఉండాల్సిందని జెలెన్స్కీ చెప్పాడు. ఆదివారం సాయంత్రం యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో, పశ్చిమాన ఉన్న ఎల్వివ్ నుండి నల్ల సముద్రం మీద ఒడెస్సా వరకు,  ఉత్తరాన ఖార్కివ్ వరకు వైమానిక దాడి సైరన్లు వినిపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News