లక్నో: గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మాద్ తనయుడు అసద్ ఎన్‌కౌంటర్‌లో హతమైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలో జరిగింది. ఉమేష్ పాల్ మర్డర్ కేసులో అసద్, ఘూలామ్ కూడా నిందితులుగా ఉండడంతో ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని కాల్చి చంపారు. అసద్‌తో పాటు మక్సూదన్ కుమారుడు ఘులామ్‌ను ఎన్‌కౌంటర్‌లో ఎస్‌టిఎఫ్ పోలీసులు చంపేశారు. ఇద్దరు తలలపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్ ఇద్దరు హతమయ్యారని డిఎస్‌పి నవేందు, డిఎస్‌పి విమల్ తెలిపారు. అసద్‌ను ఎన్‌కౌంటర్‌లో చంపేయడంతో ఉమేష్ పాల్ తల్లి యుపి సిఎం యోగి ఆదిత్యానాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ తన కుమారుడికి నివాళులర్పిస్తున్నానని చెప్పారు.
Also Read: ‘బలగం’ మొగిలయ్యకు గుండె సమస్య లేదు.. నిలకడగా ఆరోగ్యం
#WATCH | Former MP Atiq Ahmed's son Asad, aide killed in an encounter by UP STF in Jhansi
Visuals from the encounter site pic.twitter.com/kL3fUrr7S7
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2023
#WATCH | A by-stander at CJM court in Prayagraj throws a bottle at former MP Atiq Ahmed who has been brought to the court for an appearance in Umesh Pal murder case pic.twitter.com/AWFu7PyNLz
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2023