మన తెలంగాణ / హైదరాబాద్ : శూద్రుని పని అగ్రవర్ణాలకు సేవ చేయడమేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఎక్స్‌వేదికగా చేసిన ట్వీట్‌పై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్టు వివాదానికి దారి తీయడం, నెటిజన్ల నుండి విమర్శలకు గురికావడంతో ఆ పోస్టును ఆ తర్వాత తొలగించారు. అస్సాం ముఖ్యమంత్రి సమాజంపై తన దృష్టి ఎలాంటిదో బహిర్గతం చేశారని ఓవైసి విమర్శించారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ప్రతి పౌరుడిని సమానంగా చూస్తామని ప్రమాణం చేసి వ్యవసాయం, ఆవు పెంపకం, వాణిజ్యం వైశ్యుల సహజ విదులని, బ్రహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవ చేయడం శూద్రుల సహజ విధి వ్యవసాయం, ఆవు పెంపకం మరియు వాణిజ్యం వైశ్యుల సహజ విధులు మరియు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవ చేయడం శూద్రుల సహజ విధి అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పేర్కొనడం దురదృష్టకరమని ఓవైసి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అస్సాం ముస్లింలు ఎదుర్కొంటున్న దురదృష్టకర క్రూరత్వానికి ఇది ప్రతిబింబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందుత్వ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయానికి ఇది విరుద్ధమని ఓవైసి పేర్కొన్నారు.