Monday, December 23, 2024

జంటనగరాల్లో అసదుద్దీన్ హల్‌చల్

- Advertisement -
- Advertisement -

బైక్‌పై తిరుగుతూ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న ఓవైసి

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాల్లో ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి హల్‌చల్ చేశారు. బైక్‌పై కలియ తిరుగుతూ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. ఓవైసికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనం తరలిరావడం, పలు ప్రాంతాల్లో ఓవైసిపై పూలవర్షం కురిపించడం గమనార్హం. హైదరాబాద్, సికిందరాబాద్‌లలోని పలు ప్రాంతాలలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ముఖ్యమంగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భోలక్‌పూర్, ఎర్రగడ్డలోని ఎజి కాలనీ, రహమత్ నగర్, షేక్‌పేట్, పాతబస్తీలోని మదీనా సర్కిల్ లలో అసదుద్దీన్ ఓవైసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు.

ఈ సందర్భంగా ఆయన జంటనగరాల ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాగా అసదుద్దీన్ ఓవైసి బైక్‌పై తిరగడంతో చూడడానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఎంఐఎం పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాఠశాలల విద్యార్థులు, మదరసా విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికి అక్బరుద్దీన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Asaduddin 3

Akbaruddin

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News