- Advertisement -
హైదరాబాద్: 2014 తర్వాత హత్యకు గురైన మొదటి వ్యక్తి మొహిసిన్ అని, ఈ హత్యకు కారణం అతను ముస్లిం కావడమేనని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసి అన్నారు. ఈ ఎనిమిదేళ్ళలో నలుగురు ముఖ్యమంత్రులు మారారని, నిందితులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారని తెలిపారు. హంతకులు జైలుకు వెళ్ళకుండా విడుదలవడం చూడకుండానే మొహిసిన్ తండ్రి చనిపోయాడని అసదుద్దీన్ అన్నారు.
జూన్ 2, 2014న రాత్రి సమయంలో పూణెలోని మసీదులో ప్రార్థనలు చేసి స్నేషితుడు రియాజ్ అహ్మద్ ముబారక్‌తో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా హిందూ రాష్ట్ర సేన (హెచ్‌ఆర్‌ఎస్)తో సంబంధం ఉన్న యువకులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులను పూణేలోని సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై అసదుద్దీన్ పై విధంగా స్పందించారు.
- Advertisement -