Thursday, September 19, 2024

భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న టి20 మ్యాచ్‌పై మండిపడ్డ అసద్

- Advertisement -
- Advertisement -

Asaduddin Owaisi angry over T20 match between India and Pakistan

 

మన తెలంగాణ/హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల్లో తొమ్మిది మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. ఓ వైపు పాక్ ప్రోత్సాహంతో చెలరుగిపోతోన్న ఉగ్రవాదం వల్ల మన సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు టి20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడుతుందని ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కేంద్ర సర్కారు విఫలమైందన్నారు. చైనాను ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ సమర్థంగా పనిచేయట్లేదని చెప్పారు. రెండు అంశాలపై ప్రధాని మోడీ స్పందించడం లేదని ఆయన చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.100 దాటినా స్పందించడం లేదని, అలాగే, సరిహద్దుల్లో చైనా కూడా మన భూభాగంలోకి ప్రవేశిస్తోందని, దీనిపై కూడా మోడీ స్పందించడం లేదని ఆయన విమర్శించారు. మన భూభాగాల్లోకి చైనా సైనికులు దూసుకువస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఏమి చేయలేకపోతోందని ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News