Monday, November 25, 2024

ఐదు వందల నోట్లు కూడా రద్దు చేస్తారా..?: అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రెండు వేల రూపాయల నోట్లను రద్దుచేస్తూ మోడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి స్పందించారు. త్వరలోనే ఐదు వందల రూపయాల నోట్లు కూడా రద్దు చేస్తారా ? అని ప్రశ్నించారు. డిజిటల్ లావాదేవాలను ప్రోత్సహిస్తున్నామంటున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో 70 కోట్ల మందికి స్మార్ట్ ఫోన్లు లేని విషయాన్ని గమనంలోకి తీసుకున్నట్లు లేదని అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడికి ఒవైసి ఐదు ప్రశ్నలను సంధించారు. ‘ మీరు రూ.2000 నోటును ఎందుకు ప్రవేశ పెట్టారు ?, రూ.500 నోటు త్వరలో ఉపసంహరించబడుతుందని మేము ఆశించవచ్చా ? 70 కోట్ల మంది భారతీయులకు స్మార్ట్ ఫోన్ లేదు, వారు డిజిటల్ పేమెంట్ ఎలా చేస్తారు ? డెమో 1.0, డెమో 2.0 చేయడంలో బిల్ గేట్స్ పాత్ర ఏమిటి ? ఎన్‌సిపిఐ చైనా హ్యాకర్లచే హ్యాక్ చేయబడిందా ? అయితే యుద్దం జరిగినప్పుడు చెల్లింపులకు ఏమి జరుగుతుంది’ అని ఓవైసి ప్రశ్నలు సందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News