Monday, December 23, 2024

అసదుద్దీన్ ఒవైసి వియ్యంకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఐఎం అధినేత ఎంపి అసదుద్ధీన్ ఓవైసి వియ్యంకుడు డా మజార్ ఉద్దీన్ అలీఖాన్ (60) ఆత్మహత్య చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో అతడు తుపాకీతో కాల్చుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న అతడిని వెంటనే ఆపోలో ఆస్పత్రికి తరలించారు. అలీఖాన్ కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి భార్యతో, ఆస్తి వివాదంలో గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో మానసిక సమస్యలతో అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ప్రతి రోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య అతడిని నిద్రలేపేది. బెడ్ రూమ్‌లోకి వచ్చిన ఆమెపై అతడు కసురుకోవడంతో బయటకు వెళ్లింది. అన్ని పనులు చేసుకొని 11 గంటలకు బెడ్ రూమ్ వచ్చేసరికి అతడు అచేతనంగా పడివున్నాడు. వెంటనే పని మనిషి అతడు భార్య, కుమారుడికి ఫోన్ చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News