Monday, December 23, 2024

నాపై పోటీ చేయండి

- Advertisement -
- Advertisement -

దమ్ముంటే హైదరాబాద్ నుంచి

రాహుల్‌కు ఓవైసి సవాల్

మన తెలంగాణ/ హైదరాబాద్ : దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేసి తన అదృష్టాన్ని పరిరక్షించుకోవాలని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. శనివారం తనను కలిసిన విలేకరులతో ఓవైసి మాట్లాడారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలో తెలియదని, అన్నారు. ఇలా అయితే టిఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లేదా మె దక్ నుంచి పోటీచేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని టిఆర్‌ఎస్, బిజెపితో సహా ఓవైసిని సవాల్ చేసేందుకే తాను తెలంగాణకు వచ్చినట్లు రాహుల్ ఓవైసి పై విధంగా స్పందించారు. ఇక్కడి ప్రజలకు ఏ సందేశం ఇవ్వా లో కూడా ఆయనకు తెలియదని ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News